జనగామ జిల్లా – చిల్పూర్ మండలం లో విషాదం! అనుమానాస్పదంగా మృతి
జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలం, కొండాపూర్ గ్రామంలో దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముత్యాల సురేష్ (వయసు 30) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.
గ్రామ పరిసరాల్లోని ఒక తోటలో మృతదేహం పడి ఉన్నట్లు గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
సూచన అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 🚨

Post a Comment