-->

కాశీబుగ్గ దేవాలయంలో తొక్కిసలాట, 9 మంది మృతి

కాశీబుగ్గ దేవాలయంలో తొక్కిసలాట, 9 మంది మృతి


శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

ఏకాదశి సందర్భంగా ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో రేయిలింగ్ ఊడిపోవడంతో నియంత్రణ కోల్పోయిన భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.

స్థలానికి పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రభుత్వం ఘటనపై విచారణ ఆదేశించే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793