-->

కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదం – 15 మందికి గాయాలు

కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదం – 15 మందికి గాయాలు


కరీంనగర్‌, నవంబర్‌ 4: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ పరిధిలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపునకు వస్తున్న మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, రేణికుంట శివారులో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు వెంటనే అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక విచారణలో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనతో కొంతసేపు రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793