-->

రేపే కార్తీక పౌర్ణమి! భక్తులతో కిటకిటలాడనున్న శివాలయాలు

రేపే కార్తీక పౌర్ణమి! భక్తులతో కిటకిటలాడనున్న శివాలయాలు


భూపాలపల్లి జిల్లా : నవంబర్ 04: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కార్తీక మాసం కొనసాగుతోంది. ఈ మాసంలో ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు వేములవాడ, కాలేశ్వరం, ధర్మపురి వంటి ప్రముఖ శైవక్షేత్రాలకు తరలివెళ్తున్నారు. శివాలయాలు దీపాల కాంతులతో, శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తున్నారు.

సహజంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. కానీ కార్తీక మాసంలో మాత్రం ప్రతి రోజూ ఆమెకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ మాసంలోని ముఖ్యమైన పండుగ కార్తీక పౌర్ణమి రేపు, నవంబర్ 05న జరగనుంది.

పండితుల సూచనల ప్రకారం, ఈ రోజు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేయాలి. దేవాలయంలో, రావి లేదా తులసి చెట్టు వద్ద గానీ, నదీతీరంలో గానీ 365 వత్తులతో దీపారాధన చేస్తే అపార పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం దీపారాధన చేసి పరమేశ్వరుడు, విష్ణుమూర్తిని పూజించాలి. పవిత్ర నదుల్లో స్నానం చేయడం కూడా విశిష్టమైన ఆచారం.

కార్తీక పౌర్ణమి తో పాటు గురు నానక్ జయంతి కూడా రేపే జరగనుండడంతో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రేపు సెలవు ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సెలవు విషయంలో కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. భక్తి, దీపాలు, పుణ్యస్నానాలతో రేపు తెలుగు రాష్ట్రాలు వెలుగుల వేదికగా మారనున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793