కేవలం 33 రోజుల్లోనే… కార్తీకమాసంలో శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం కొత్త రికార్డు!
కార్తీకమాసం సందడి… భక్తుల పొంగిపొర్లే రద్దీ… శ్రీశైల పర్వతక్షేత్రం భక్తి జలపాతం లా మారింది. ఈ ఆధ్యాత్మిక ఉత్సాహం ప్రభావం నేరుగా హుండీ ఆదాయంలో ప్రతిఫలించింది.
తాజాగా చంద్రావతి కళ్యాణమండపంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో మొత్తం ₹7,27,26,400 ఆదాయం నమోదు కావడంతో దేవస్థానంలో ఆనందం నెలకొంది.
దేశంతో పాటు విదేశాల నుండి వచ్చిన భక్తులు కూడా స్వామి–అమ్మవార్లకు తమ కానుకలను అర్పించారు.
విదేశీ కరెన్సీల జాబితా ఇలా ఉంది:
- USA డాలర్లు: 646
- సౌదీ రియాల్స్: 85
- యూఏఈ దిర్హమ్స్: 120
- కతార్ రియల్స్: 136
- సింగపూర్ డాలర్లు: 30
- ఇంగ్లాండ్ పౌండ్స్: 85
- ఆస్ట్రేలియా డాలర్లు: 25
- ఒమన్ బైంసా: 200
ఇతర కానుకలు:
- బంగారం: 117.800 గ్రాములు
- వెండి: 7 కిలోలు 230 గ్రాములు
ఈ లెక్కింపు పూర్తిగా పటిష్ఠ నిఘా మధ్య, ఈవో శ్రీనివాసరావు స్వయంగా పర్యవేక్షణలో జరిగింది. దేవస్థానం అధికారులు, ఉద్యోగులు, శివసేవకులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.
కార్తీకమాస భక్తిభావానికి, శ్రీశైల క్షేత్రంపై భక్తుల అచంచలమైన విశ్వాసానికి, మరొక సాక్ష్యంగా మల్లన్న హుండీ నిలిచింది.
భక్తిశ్రద్ధ… భక్తి నిధులుగా మారితే… ఇలా రికార్డులే రాస్తాయి!

Post a Comment