ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా | నవంబర్ 25: వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంగళవారం ఉదయం త్రుటిలో ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇటీవల నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు ఆయన కాంగ్రెస్ నేతలు, అధికారులు కలిసి సందర్శించారు.
బేస్మెంట్ అకస్మాత్తుగా కుంగిపోవడంతో ఆందోళన
అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి గృహ సముదాయం బేస్మెంట్‌పై నిలబడి నిర్మాణ నాణ్యతను పరిశీలిస్తున్న సమయంలో, బేస్మెంట్ ఒక్కసారిగా కుంగిపోవడం కలకలం రేపింది. ఇదే సమయంలో ఆది శ్రీనివాస్ కిందకు జారిపడే పరిస్థితి ఏర్పడింది.
అయితే వెంటనే అప్రమత్తమై ఉన్న కాంగ్రెస్ నేతలు ఆయనను పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనను చూసిన అధికారులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు
టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో నిర్మించిన ఈ డబుల్ బెడ్‌రూమ్ గృహాల నాణ్యతపై స్థానికులు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ఈ సంఘటన మరింత ప్రశ్నార్థకంగా మారింది.
దర్యాప్తు డిమాండ్
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్మాణ నాణ్యతపై విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Post a Comment