జూబ్లీహిల్స్ ప్రచారానికి ఈరోజే తెర! భారీ ర్యాలీలు, రోడ్ షోలు – త్రిముఖ పోరుకు ప్రధాన పార్టీల సన్నాహాలు
హైదరాబాద్, నవంబర్ 9 : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హీటెక్కింది. 17 రోజులుగా హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు చివరి రోజు భారీ ర్యాలీలు, రోడ్ షోలకు సిద్ధమయ్యాయి.
స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. గత నెల 13న నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ నెల 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 3.92 లక్షల ఓటర్లున్న ఈ హై–ప్రొఫైల్ నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది.
కాంగ్రెస్ – స్కీమ్లతో ప్రజల్లోకి
ఇంటింటి ప్రచారాన్ని ఇప్పటికే ముగించిన కాంగ్రెస్ పార్టీ, చివరి రోజు కూడా ప్రతి గడపకూ వెళ్లాలని నిర్ణయించింది. మంత్రుల ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి రెండు ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు.
ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ తన సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు పూనుకుంది. అర్బన్ ప్రాంతాల్లో తన బలం నిరూపించుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహం. వరుస ఎన్నికల్లో పరాజయాల కారణంగా కేడర్‌లో నిస్పృహ ఏర్పడగా, జూబ్లీహిల్స్ విజయంతో ఆత్మవిశ్వాసం పెంచాలని భావిస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచి తామే కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అని చాటుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభంలో సద్దుమణిగిన ప్రచారం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగడంతో ఊపందుకుంది. ఆయనతో పాటు బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పి.వి.ఎన్. మాధవ్ ప్రచారంలో పాల్గొన్నారు.
లంకల దీపక్ రెడ్డి అభ్యర్థిగా బరిలో ఉన్న ఈ పార్టీ, మోదీ చరిష్మా, జాతీయవాదం తమకు కలిసి వస్తాయని విశ్వసిస్తోంది. త్రిముఖ పోరులో ఓట్ల చీలిక బీజేపీకి లాభమవుతుందని అంచనా.
పోల్ మేనేజ్‌మెంట్ కీలకం
ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో మూడు పార్టీలూ పోల్ మేనేజ్‌మెంట్ వ్యూహాలపై దృష్టి పెట్టాయి. ప్రతి పోలింగ్ బూత్‌కు ఇద్దరు కీలక కార్యకర్తలను నియమించడం, ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడం, చివరి నిమిషం ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడం వంటి అంశాలపై పార్టీలు దృష్టి సారించాయి.
సీఎం రేవంత్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించింది. బీఆర్ఎస్, బీజేపీ కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి.
కుల సమీకరణాలు, మైనారిటీ ఓట్లే గెలుపు నిర్ణయం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ, మైనారిటీ ఓట్లు ఫలితాలను నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని నిలబెట్టి ఆ వర్గం ఓటర్లను ఆకర్షిస్తోంది. బీఆర్ఎస్ ఓసీ అభ్యర్థిని బరిలో నిలబెట్టి తలసాని వంటి నేతలతో బీసీ ఓట్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టి బీసీ, యువ ఓటర్లను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తోంది.
నియోజకవర్గంలో మైనారిటీల ఓట్లు మూడోవంతు ఉండటంతో అన్ని పార్టీలు ఆ వర్గంపై దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు లభించడంతో మైనారిటీ ఓట్లు తమవేనని ఆ పార్టీ భావిస్తోంది. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం, అక్బరుద్దీన్ ఓవైసీ ప్రచారంలో పాల్గొనడం కాంగ్రెస్‌కు అదనపు లాభంగా మారనుంది. ఇక బీఆర్ఎస్ తరఫున మహమూద్ అలీ రంగంలోకి దిగారు.
మొత్తానికి,

Post a Comment