-->

కార్తీక పౌర్ణమి శివనామస్మరణతో మారుమోగుతున్న దేవాలయాలు

 

కార్తీక పౌర్ణమి శివనామస్మరణతో మారుమోగుతున్న దేవాలయాలు

నవంబర్ 05: తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి ఉత్సాహంగా ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజాము నుంచి భక్తులు దేవాలయాలకు భారీగా తరలివస్తున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం, అరటి తొక్కలలో దీపాలు వెలిగించి పవిత్ర నదుల్లో వదిలేయడం భక్తుల భక్తి విశేషంగా నిలుస్తోంది.

శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో స్నానం చేసి స్వామి–అమ్మవార్ల దర్శనం పొందుతున్నారు. సాధారణ దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది.

కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరంగల్ వేయిస్తంభాల దేవాలయం, భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, రాజన్న సిరిసిల్లలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, రామప్ప దేవాలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, పాలకుర్తి సోమేశ్వర–లక్ష్మీనరసింహ స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ ఉరుముతోంది.

భక్తుల నినాదాలతో, శివనామస్మరణతో ఆ ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగుతున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793