-->

ఊరంతా నాటుకోడి పులుసే..! నవ్వు తెప్పించే విచిత్ర సంఘటన

ఊరంతా నాటుకోడి పులుసే..! నవ్వు తెప్పించే విచిత్ర సంఘటన


హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో నవ్వు తెప్పించే విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఎల్కతుర్తి–సిద్దిపేట జాతీయ రహదారి వెంట గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రెండు వేల నాటుకోళ్లను వదిలేశారు.

అరగంటలోనే ఆ విషయం ఊరంతా పాకిపోయింది.
కొద్దిసేపట్లోనే రహదారి పొలాల్లా, పత్తి చేన్లలా కోళ్లను వెంబడించే జనంతో కళకళలాడింది. ఎవరి చేతికి దొరికిన కోడి వారిదే అన్నట్టుగా, పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కోళ్ల కోసం పరుగులు పెట్టారు.

కొందరు చేతుల్లో ఒక్కో కోడి పట్టుకొని వెళ్లగా, మరికొందరు సంచుల్లో పదుల కొద్దీ నింపుకొని ఇంటి బాట పట్టారు. ఈ కోడి వేటతో నేడు ఎల్కతుర్తి గ్రామంలో అనేక కుటుంబాలు “చికెన్ విందు భోజనం” చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, “ఎల్కతుర్తి బిర్యానీ ఫెస్టివల్” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 🐔🍛😂

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793