మొబిలిటీ సైకిల్ పరిశ్రమలో మంటలు – ఆందోళనకు గురైన కార్మికులు
మెదక్, మనోహరాబాద్, నవంబర్ 8: మనోహరాబాద్ మండలం కుచారం పరిధిలోని మదిరి డిల్లాయి తండాలో ఉన్న మొబిలిటీ సైకిల్ పరిశ్రమలో శనివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
కార్మికులు సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు భయంతో పరుగులు తీస్తూ బయటకు వచ్చారు.
ప్రమాదం సమయంలో పరిశ్రమలో భారీ నష్టం సంభవించిందని, యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కార్మికులు ఆరోపించారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Post a Comment