నల్లగొండలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
నల్లగొండలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గడియారం సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ మునాస ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ఈ నెలాఖరున జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో నాయకులు గండిచెరువు వెంకన్నగౌడ్, జనార్దన్‌గౌడ్, ఎం.ఏ. ఖదీర్, పుట్ట వెంకన్నగౌడ్, కర్నాటి యాదగిరి, చిలుకరాజు సతీష్, మార్గం సతీష్ కుమార్, కొంపల్లి రామన్నగౌడ్, చెన్నోజు రాజు, చెన్నోజు భరద్వాజ, కల్లూరి సత్యనారాయణగౌడ్, నీలం వెంకటమధు, అనంత నాగరాజుగౌడ్, గడగోజు విజయ్, తలారి రాంబాబు, ఆమంచి స్వామి, అంబటి శివ, పుల్లెందుల అంజయ్య, గడ్డం మారయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment