భర్తను డీజిల్ పోసి కాల్చి చంపిన భార్యలు
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం దేవక్కపేట గ్రామంలో సోమవారం నాడు చోటుచేసుకున్న ఘోర హత్యా ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. కుటుంబ కలహాలు వికృతరూపం దాల్చడంతో ఓ వ్యక్తిని అతని రెండువురు భార్యలు కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది.
డీజిల్ పోసి మంటలు అంటించిన భార్యలు
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాలావత్ మోహన్ (38) వివాహితుడు, ఇద్దరు భార్యలతో కలిసి జీవిస్తున్నాడు. అయితే కొంతకాలంగా కుటుంబ వివాదాలు, కలహాలు కొనసాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మోహన్‌పై ఇద్దరు భార్యలు కలిసి డీజిల్ పోసి నిప్పంటించి హతమార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఐదుగురు కూతుళ్ల తండ్రి… గ్రామంలో కలకలం
మోహన్‌కు ఐదుగురు కూతుళ్లు ఉన్నట్లు గ్రామస్తుల సమాచారం. అకస్మాత్తుగా జరిగిన ఈ పాశవిక ఘటనతో దేవక్కపేట గ్రామంలో ఒకసారిగా ఉద్రిక్తత, ఆందోళన వాతావరణం నెలకొంది. ఘటనాస్థలి వద్దకు స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
పోలీసుల విచారణ వేగవంతం
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
ప్రాథమిక వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు భీమ్గల్ పోలీసు అధికారులు తెలిపారు.
మోహన్‌పై భార్యలు హత్యకు ఎందుకు పాల్పడ్డారు?
ఏవైనా వ్యక్తిగత విభేధాలు, గృహహింస లేదా ఇతర కారణాలున్నాయా? అన్న విషయాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
గ్రామాన్ని కుదిపేసిన నరమేధం
కుటుంబ కలహాలు ఎంతటి విషాదానికి దారి తీసాయన్న దానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. మోహన్ ఐదు కుమార్తెల భవితవ్యంపై కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
➡️ మరిన్ని వివరాలు పోలీసులు ప్రకటించాల్సి ఉంది. దర్యాప్తు కొనసాగుతోంది.

Post a Comment