పోలీస్ స్టేషన్లోనే దొంగతనం… రూ.1.75 లక్షల ఫోన్ కొట్టేసిన పోలీస్ డ్రైవర్
హైదరాబాద్: మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌లో విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. దొంగల నుండి రికవరీ చేసిన ఖరీదైన ఫోన్‌ను స్టేషన్‌లోని డ్రైవర్ దొంగిలించిన ఘటన కలకలం రేపుతోంది.
మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు బజార్ వద్ద ఫోన్ పోయిందని ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించి పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.1.75 లక్షల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రికవరీ చేసి స్టేషన్ లాకర్‌లో భద్రపరిచారు.
అయితే, ఆ ఫోన్ ఖరీదు చూసిన పోలీస్ స్టేషన్ డ్రైవర్ శ్రవణ్ కుమార్ దానిపై కన్నేసి, లాకర్ నుండి అపహరించాడు. ఫోన్ కనిపించకపోవడంతో పోలీసు అధికారులు అంతర్గత విచారణ జరిపి, శ్రవణ్ కుమార్ ఈ దొంగతనానికి పాల్పడ్డాడని నిర్ధారించారు.
ఈ నేపథ్యంలో డ్రైవర్ శ్రవణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఘటనతో పోలీస్ శాఖలోనే భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తాయి..

Post a Comment