భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తోటి విద్యార్థుల ఇంటి ముందు ధర్నా వింత నిరసన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామంలో ఓ వింత నిరసన అలజడి రేపింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నాల్గో తరగతి విద్యార్థి గత వారం రోజులుగా స్కూల్‌కు హాజరుకాని పరిస్థితిపై ఉపాధ్యాయులు అనుమానం వ్యక్తం చేశారు.
పిల్లాడిని ఎందుకు స్కూల్‌కు పంపడం లేదని పరిశీలనలో భాగంగా ఉపాధ్యాయులు బాలుడి ఇంటికి వెళ్లగా… తల్లిదండ్రులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పరిస్థితి మరింత సందిగ్ధంగా మారింది. పలుమార్లు అడిగినా కారణం చెప్పకపోవడంతో ఉపాధ్యాయులు అసహనంతో నిన్నే బాలుడి ఇంటి ముందే బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ నిరసనలో పాఠశాలకు చెందిన తోటి విద్యార్థులు కూడా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఉపాధ్యాయులు, సహచరుల సమక్షంలో ధర్నా కొనసాగుతుండడంతో చివరకు తల్లిదండ్రులు స్పందించారు. సోమవారం నుండి తమ బిడ్డను నిత్యం స్కూల్‌కు పంపిస్తామని ఉపాధ్యాయులకు భరోసా ఇచ్చారు.
గ్రామంలో ఈ ఘటన మంచి చర్చనీయాంశమై, పిల్లల విద్యపై తల్లిదండ్రులు చూపవలసిన బాధ్యత ఎంత ముఖ్యమో స్థానికులకు మరోసారి గుర్తు చేసింది.

Post a Comment