అతివేగంతో కారు బోల్తా – ఇద్దరికి తీవ్ర గాయాలు
బోథ్ మండలం మన్నూర్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అతివేగంతో అదుపు తప్పి రోడ్డుపక్కన బోల్తా పడింది.
ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు.

Post a Comment