చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఆటో డ్రైవర్ దుర్మరణం
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పాటి సురేందర్ (42) ఆదివారం ఇంట్లో చికెన్‌తో అన్నం తింటుండగా చికెన్ ముక్క అనుకోకుండా గొంతులో ఇరుక్కుంది. శ్వాస ఆడకపోవడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు.
ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు మిగిలారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది..

Post a Comment