-->

రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థిని మృతి మృతురాలు సిరిసిల్లకు చెందిన హాసిని(18)

రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థిని మృతి మృతురాలు సిరిసిల్లకు చెందిన హాసిని(18)


హైదరాబాద్‌ : ఘట్‌కేసర్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థిని హాసిని(18) దుర్మరణం చెందింది. సిరిసిల్లకు చెందిన హాసిని, ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కాలేజీ సమీపంలోని హాస్టల్‌లో నివసిస్తోంది.

శుక్రవారం అర్ధరాత్రి స్నేహితుడు అక్షయ్‌తో కలిసి ఉప్పల్‌కు వెళ్లిన హాసిని, అక్కడి నుండి బైక్‌పై ఘట్‌కేసర్ వైపు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. రాత్రి 2 గంటల సమయంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పై పడిపోయింది. ఈ ఘటనలో హాసిని తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

పరిస్థితిని గమనించిన అక్కడి వారు పోలీసులకు సమాచారమిచ్చారు. హాసిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793