రాష్ట్రవ్యాప్తంగా 415 సర్పంచ్‌లు, 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవం
హైదరాబాద్ : డిసెంబర్ 08: తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో భారీగా ఏకగ్రీవాలు నమోదయ్యాయి. మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, 8,304 వార్డు సభ్యులు పోటీ లేకుండానే విజయం సాధించారు అని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అధికారికంగా ప్రకటించింది.
జిల్లాల వారీగా ఏకగ్రీవాలు
సర్పంచ్ ఏకగ్రీవ స్థానాల్లో కామారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
- కామారెడ్డి – 44
- నల్గొండ – 38
- నిజామాబాద్ – 38
ఇక పలు కారణాలతో 5 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో ఆ స్థానాలపై పోలింగ్ ఉండదని స్పష్టం చేశారు.
ఎన్నికల పరిస్థితి
రెండో విడతలో భాగంగా
- 4,332 గ్రామ పంచాయతీలు
- 38,322 వార్డులకుఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో,
- సర్పంచ్ బరి నుంచి 7,584 మంది
- వార్డు సభ్యుల బరి నుంచి 10,427 మందితమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాలు
మొదటి మరియు రెండో విడతలను కలిపి ఇప్పటివరకు:
- 810 మంది సర్పంచ్‌లు
- 17,635 మంది వార్డు సభ్యులుఏకగ్రీవంగా ఎన్నికైందని ఎస్ఈసీ వెల్లడించింది.
మిగిలిన స్థానాలకు త్వరలో పోలింగ్
ఏకగ్రీవం కాలేదు మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు మరియు సంబంధిత వార్డులకు త్వరలోనే పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

Post a Comment