పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్–సిపిఐ అభ్యర్థులనే గెలిపించాలి: సిపిఐ జిల్లా నాయకుడు తాజోద్దీన్
సదాశివపేట, డిసెంబర్ — పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరియు సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి పాలుపంచాల్సిన అవసరం ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తాజోద్దీన్ పేర్కొన్నారు. ఆదివారం సదాశివపేటలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాజోద్దీన్ మాట్లాడుతూ సదాశివపేట, కొండాపూర్ మండలాల పరిధిలో ఉన్న అన్ని గ్రామపంచాయతీలు, గిరిజన తండాల్లో ప్రజలు కాంగ్రెస్–సిపిఐ మద్దతు పొందిన అభ్యర్థులను భారీ మెజార్టీతో ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకులు గెలవాలి, గ్రామాల అభివృద్ధి కోసం ప్రగతిశీల శక్తులను బలపరచాలని కోరారు.
బిజెపిని తీవ్రంగా విమర్శించిన తాజోద్దీన్—
మతోన్మాద శక్తులను, బిజెపి నేతలను ప్రజలు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్ పూర్తిగా బూటకమని ఆరోపించారు. అడవి సంపదను కబ్జా చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ చర్యలతో ఆదివాసీల జీవన విధానమే ప్రమాదంలో పడుతోందని తెలిపారు.
సమావేశంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి శంకరప్ప, పార్టీ నాయకులు సాదిక్ అలీ, పూలమ్మ, జ్యోతి, సరస్వతి, దేవి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment