-->

వెంకటేష్ ఖని గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి తాటి అనంతలక్ష్మి

వెంకటేష్ ఖని గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి తాటి అనంతలక్ష్మి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం వెంకటేష్ ఖని గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తాటి అనంతలక్ష్మి బరిలో నిలిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు అణగారిన వర్గాలకు బలమైన మద్దతు లభిస్తున్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తాటి అనంతలక్ష్మి మాట్లాడుతూ "గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లే పరిపాలన నా లక్ష్యం. రాజకీయ పార్టీలపై ఆధారపడకుండా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను” అని చెప్పారు.

తాను పోటీ చేస్తున్న సర్పంచ్ స్థానానికి ఎన్నికల గుర్తుగా ‘ఉంగరం’ గుర్తు కేటాయించినట్లు వెల్లడించిన అనంతలక్ష్మి "వెంకటేష్ ఖని గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేసి, అఖండ మెజారిటీతో నన్ను గెలిపించాలని వేడుకుంటున్నాను. ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి సరైన ప్రతిఫలం ఇవ్వడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాను" అని అన్నారు.

గ్రామంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో స్థానికులు, మహిళలు, యువత పెద్దఎత్తున పాల్గొంటుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793