-->

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండ మహబూబ్ జానీ నివాసంలో ఘనంగా గ్యార్వీ షరీఫ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండ మహబూబ్ జానీ నివాసంలో ఘనంగా గ్యార్వీ షరీఫ్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామంలో మోహమ్మద్ మహబూబ్ (జానీ) గారి నివాసంలో గ్యార్వీ షరీఫ్ ఉత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమానికి గ్రామంలోని భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అతిథులుగా మొహమ్మద్ ముజిబ్ బాబా, మొహమ్మద్ ఖాజా బాబా ఖాద్రి పాల్గొన్నారు. వారు దర్గా పీఠాధిపతుల సంప్రదాయ ప్రకారం గ్యార్వీ షరీఫ్ ఫాతేహ ఖానీ చేసి, సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ (ర.అ) వారికి అంకితమైన ప్రార్థనలను నిర్వహించారు.

తరువాత కార్యక్రమానికి హాజరైన అందరికీ అన్నప్రసాదం (దస్తర్ ఖ్వాన్) ఏర్పాటు చేసి భక్తులకు పంపిణీ చేశారు. స్థానికులు ఈ కార్యక్రమం ఎంతో శాంతియుతంగా, భక్తి భవంతో సాగిందని తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793