తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ నోబెల్ హ్యూమన్ రైట్స్ కమిటీ జనరల్ బాడీ మీటింగ్ విజయవంతం
మానవ హక్కుల దినోత్సవానికి ప్రత్యేక సేవా కార్యక్రమాలపై నిర్ణయం
30 నవంబర్ 2025: తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో యునైటెడ్ నోబెల్ హ్యూమన్ రైట్స్ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొహమ్మద్ జహీర్ ఇక్బాల్ నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ విజయవంతంగా ముగిసింది. సమావేశానికి హాజరైన సభ్యులందరికీ రాష్ట్ర అధ్యక్షులు తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ మీటింగ్‌ను జాతీయ అధ్యక్షులు నీలేష్ భాయ్ జోషి, అలాగే దీపక్ సార్, మోయాజ్ సార్ గారి మార్గదర్శకత్వంలో నిర్వహించారు. వారి విలువైన సూచనలు, సలహాలు సమావేశాన్ని మరింత ఫలప్రదంగా మార్చాయి.
సమావేశంలో యునైటెడ్ నోబెల్ హ్యూమన్ రైట్స్ కమిటీ తరఫున సభ్యులు పలు ముఖ్యమైన అభిప్రాయాలు తెలియజేశారు. రాబోయే 10 డిసెంబర్ 2025 (బుధవారం) న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా చేపట్టబోయే సేవా కార్యక్రమాలపై విస్తృత చర్చ జరిగింది.
చలికాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఆ రోజు అనాధాశ్రమాలు మరియు వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి దుప్పట్లు, పండ్ల పంపిణీ చేయాలనే ప్రతిపాదనను సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ నిర్ణయాలు సామాజిక సేవ పట్ల ఆర్గనైజేషన్ యొక్క దృఢ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.

Post a Comment