-->

సుప్రీం కోర్టులో పిల్‌: ప్రభుత్వ నిధుల ఖర్చులను ఆన్‌లైన్‌లో ఉంచాలని సామాజిక నేత అందె రఘు డిమాండ్

సుప్రీం కోర్టులో పిల్‌: ప్రభుత్వ నిధుల ఖర్చులను ఆన్‌లైన్‌లో ఉంచాలని సామాజిక నేత అందె రఘు డిమాండ్


ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు ప్రముఖ సామాజిక నేత అందె రఘు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఆయన దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) కు సుప్రీం కోర్టు నంబర్ కేటాయించి ఫైల్ చేసింది. ఈ పిటిషన్ త్వరలో విచారణకు రానుంది.

అందె రఘు మాట్లాడుతూ “భారతదేశంలో ప్రభుత్వ నిధులు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, ఇతర ప్రజా కార్యక్రమాల కోసం ఎంత కేటాయిస్తారు? వాటిని ఎక్కడ, ఎలా ఖర్చు చేస్తున్నారు? అనే వివరాలను ప్రజలు RTI (సమాచార హక్కు చట్టం) వేయకుండా స్వయంగా ఇంటర్నెట్‌లో ప్రదర్శించాలని మేము కోరుతున్నాము.

ఇవి ప్రజల డబ్బు—ప్రజాధనం. ప్రతి రూపాయి ఎలా ఖర్చవుతుందో స్పష్టంగా ఆన్‌లైన్‌లో ఉంచితే పారదర్శకత పెరుగుతుంది, అవినీతి తగ్గుతుంది, ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం పెంచుకుంటారు,” అని తెలిపారు.

ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ మొదలైతే ప్రభుత్వం నిధుల వినియోగ డిజిటల్ పారదర్శకతపై జాతీయ స్థాయిలో చర్చ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు నిపుణులు భావిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793