-->

ఇల్లందు హజ్రత్ నాగుల్ మీరా దర్గా సందర్శించిన కల్వకుంట్ల కవిత

మత సామరస్యానికి ప్రతీక అయిన ఇల్లందు హజ్రత్ నాగుల్ మీరా దర్గా సందర్శించిన కల్వకుంట్ల కవిత

ఇల్లందు నియోజకవర్గంలో కొనసాగుతున్న జాగృతి జనంబాటు

ఇల్లందు | డిసెంబర్: 18: ఇల్లందు నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొనసాగుతున్న జాగృతి జనంబాటు కార్యక్రమంలో భాగంగా, ఇల్లందు మండలం సత్యనారాయణపురం గ్రామంలో ఉన్న మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే హజ్రత్ నాగుల్ మీరా దర్గాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు.

ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత గారు, రాష్ట్రంలో అన్ని మతాల మధ్య ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆకాంక్షించారు. హజ్రత్ నాగుల్ మీరా దర్గా అనాది కాలం నుంచి హిందూ–ముస్లిం ఐక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు.

జాగృతి జనంబాటు ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, సామాజిక ఐక్యత, మహిళా సాధికారత, యువత భాగస్వామ్యం వంటి అంశాలపై తెలంగాణ జాగృతి నిరంతరం కృషి చేస్తోందని కవిత తెలిపారు. మతాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కటిగా ముందుకు సాగితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, దర్గాకు చెందిన పెద్దలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కల్వకుంట్ల కవిత గారికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. మత సామరస్యాన్ని చాటే ఈ కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపిందని పాల్గొన్నవారు పేర్కొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793