యాంటీ కరప్షన్ నేషనల్ చీఫ్ డైరెక్టర్‌గా ధరవత్ బాల్సన్ నాయక్ ఎంపిక
సూర్యాపేట జిల్లా, పాలకీడు మండలం – జాన్ పహాడ్ దర్గా, కల్మెట్ తండా: స్థానిక నాయకుడు శ్రీ ధరవత్ బాల్సన్ నాయక్‌ను యాంటీ కరప్షన్ ఆఫ్ ఇండియా విజిలెన్స్ కమిషన్ నేషనల్ చీఫ్ డైరెక్టర్‌గా నియమించడంతో ప్రాంతీయ గిరిజనులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
విద్యార్థి ఉద్యమ దశ నుంచే ప్రజా సేవలో ఉన్న ఆయన, రాజకీయ రంగంలోనూ, హిందూ ధర్మ ప్రచారంలోనూ, అలాగే టీటీడీ డైరెక్టర్‌గా పనిచేస్తూ సమాజానికి అనేక సేవలు అందించారు. ప్రజల పక్షాన అవినీతి వ్యతిరేకంగా సాగించిన పోరాటం, నిబద్ధత, సేవా భావం పట్ల గుర్తింపుగా ఈ కీలక పదవికి ఆయన ఎంపిక చేసినట్లు విజిలెన్స్ కమిషన్ తెలిపింది.
“ఈ పదవి నాకు మరింత బాధ్యతను పెంచింది” – బాల్సన్ నాయక్
పదవి స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ బాల్సన్ నాయక్ అన్నారు:
- “ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి పై పూర్తి స్థాయి సమాచారం సేకరించి, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలకు నివేదికలు అందిస్తాను.”
- “ప్రజల పక్షాన నిలబడి, అవినీతిని అంతం చేయడమే నా ప్రధాన లక్ష్యం.”
ఈ నియామకంతో తమ ప్రాంతానికి మరింత గౌరవం లభించిందని స్థానిక గిరిజనులు అభినందనలు తెలియజేశారు.

Post a Comment