తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, డిసెంబర్ 01: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు కీలక సూచనలు జారీ చేసింది. ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించిన ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి నోటీసులు పంపింది.
సెప్టెంబర్ 26న విడుదలైన జీవో 1342 ప్రకారం శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర సహా పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది వడ్ల శ్రీకాంత్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద, ఈ ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ క్యాడర్‌లో ఎందుకు కొనసాగిస్తున్నారన్నదానిపై పూర్తి వివరణను డిసెంబర్ 10వ తేదీలోపు అందించాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment