లక్కంటే ఎస్సి మల్లమ్మదే… వద్దన్నా సర్పంచైతుంది!
వరంగల్ జిల్లా, ఆశాలపల్లి — ప్రత్యేక కథనం: మండలంలోని ఆశాలపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో, గ్రామంలో ఉన్న ఒక్కగానొక్క ఎస్సీ మహిళ అయిన కొంగర మల్లమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎంపిక కాబోతున్న సంఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.
గ్రామంలో అసలు ఎస్సీ కుటుంబాలే లేవు!
ఆశాలపల్లిలో స్వదేశీ ఎస్సీ కుటుంబాలు లేవు. అయితే జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం రామారం గ్రామానికి చెందిన కొంగర వెంకటయ్య – మల్లమ్మ దంపతులు సుమారు పది సంవత్సరాల క్రితం పాలేరు పనులు చేస్తూ ఇక్కడ స్థిరపడ్డారు.
ముగ్గురు కూతుళ్లను వివాహం చేసిన తర్వాత గ్రామంలో ఓటర్ల జాబితాలో ఎస్సీగా నమోదైన వారు వీరిద్దరే.
మాత్రమే కాక, మూడు నెలల క్రితం వెంకటయ్య ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఇప్పుడు ఆశాలపల్లిలో ఎస్సీ ఓటరు ఒక్కరే… ఆమేచేతే — మల్లమ్మ.
రిజర్వేషన్ వచ్చిందంటే… సర్పంచ్ పగ్గాలు ఖాయం!
ఈసారి ఆశాలపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో, ఎన్నికల్లో పోటీపడే ప్రత్యామ్నాయం లేకపోవడంతో మల్లమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్ కాబోతున్నది పక్కాగా చెప్పేస్తున్నారు గ్రామస్తులు.
రిజర్వేషన్ మార్చాలని మాజీ సర్పంచ్ కిశోర్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి సహా పలువురు నాయకులు డీపీఓ రాంరెడ్డికి వినతిపత్రం సమర్పించినప్పటికీ అధికారుల స్పష్టం “ఒకసారి రిజర్వేషన్ ప్రకటిస్తే మార్చటం అసాధ్యం!”
లెక్కల్లో లోపం… పెద్ద గందరగోళం
2011 జనగణన ప్రకారం గ్రామ జనాభా 1,807 కాగా, అందులో 350 మంది ఎస్సీలు ఉన్నట్లు అధికారులు నమోదు చేశారు. కానీ వాస్తవంగా గ్రామంలో స్థిర నివాస ఎస్సీ కుటుంబాలు లేవు. అధికారుల ఈ పొరపాటు కారణంగానే సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మల్లమ్మకు వరంగా మారిన రిజర్వేషన్
వివాహిత, భర్తను కోల్పోయిన సాధారణ మహిళగా జీవిస్తున్న మల్లమ్మకు ఇప్పుడు అగ్రస్థాన బాధ్యతలు దక్కనున్నాయి. ఒకే ఒక్క ఎస్సీ మహిళగా ఏకగ్రీవంగా సర్పంచ్ పగ్గాలు చేపట్టడం ఆమెకే కాక గ్రామానికీ ఒక ప్రత్యేక పరిణామంగా మారింది.

Post a Comment