-->

చారిత్రాత్మక ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి తరలి రావాలని పిలుపు

చారిత్రాత్మక ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి తరలి రావాలని పిలుపు

♦️ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా గ్రాండ్ ఓపెనింగ్

♦️ ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెం: కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ ప్రాంతంలో నూతనంగా స్థాపించబడుతున్న చారిత్రాత్మక డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి డిసెంబర్ 2న ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ యూనివర్సిటీ స్థాపన కొత్తగూడెం జిల్లాకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

ప్రారంభోత్సవానికి హాజరుకానున్న ముఖ్య అథితులు

  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి
  • వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి
  • మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు

అన్ని ఏర్పాట్లు పూర్తి

ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయేందుకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793