-->

చిన్నారి హత్య కేసు ఛేదించి నిందితుల అరెస్ట్ చేసిన పోలీసులు

చిన్నారి హత్య కేసు ఛేదించి నిందితుల అరెస్ట్ చేసిన పోలీసులు


రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్ పరిధిలోని దండేపల్లి పోలీస్ స్టేషన్ హద్దులో చోటుచేసుకున్న బాలిక మిస్సింగ్, హత్య కేసును అత్యంత వేగంగా ఛేదించారు. కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గారి ఆదేశాలపై, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ గారి మార్గదర్శకత్వంలో, ఏసీపీ ఆర్. ప్రకాష్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి.

ఈ బృందాలను సీఐ లక్షెట్టిపేట రమణమూర్తి, ఎస్‌ఐ దండేపల్లి తాహేసీనుద్దీన్, ఎస్‌ఐ లక్షెట్టిపేట సురేష్, ఎస్‌ఐ జన్నారం అనూష నేతృత్వం వహించారు.

కేసు వివరాలు:

తేదీ 27-11-2025 ఉదయం, బాలిక శవం కొక్కెర మల్లయ్య బావిలో తేలియాడుతూ కనిపించింది. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీస్ అధికారులు ముద్దాయిలు శనిగారపు బాపు మరియు ఉపారపు సతీష్‌లు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరూ ఒకరినొకరు ఫోన్‌లో సంప్రదించుకొని పారిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఈరోజు (01-12-2025) వారు మాదాపూర్–మ్యాదరిపేట రోడ్డులోని శ్రీ సిద్ధి వినాయక హనుమాన్ ఆలయం సమీపంలో ఉండగా పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు.

నిందితుల నుండి స్వాధీనం చేసిన వస్తువులు:

  • 2 మొబైల్ ఫోన్లు
  • 2 మోటార్‌సైకిళ్లు
  • బట్టలు
  • 2 ఖాళీ క్వార్టర్ మద్యం సీసాలు
  • హుల్కీ-ఫుల్కీ చిప్స్ పాకెట్
  • బాధితురాలి 2 గాజులు, ఒక పట్టా గొలుసు

నిందితుల వివరాలు:

1. శనిగారపు బాపు

  • తండ్రి: పోశమ్
  • వయస్సు: 52 సంవత్సరాలు
  • కులం: SC – మాదిగ
  • చిరునామా: నంబాల గ్రామం, దండేపల్లి మండలం, మంచిర్యాల జిల్లా

2. ఉపారపు సతీష్ @ సత్తయ్య

  • తండ్రి: మొండి
  • వయస్సు: 40 సంవత్సరాలు
  • కులం: SC – మాదిగ
  • చిరునామా: నంబాల గ్రామం, దండేపల్లి మండలం, మంచిర్యాల జిల్లా

ఘటనకు సంబంధించిన కీలక వివరాలు:

నిందితులు నంబాల గ్రామంలోని SC కాలనీలో నివసించే బ్యాండ్ వృత్తిదారులు. ఇద్దరి కుటుంబ పరిస్థితులు సమస్యలతో ఉండగా, తేదీ 24-11-2025న గ్రామ పరిసరాల్లో ఆడుకుంటున్న బాధితురాలిని నోరు మూసి ఎత్తుకొని పత్తిచేనులోకి తీసుకెళ్ళి దారుణంగా దాడి చేసి, నింద బయటపడుతుందనే భయంతో ఆమెను గొంతు నొక్కి హతమార్చి సమీపంలోని వ్యవసాయ బావిలో పడవేశారు.


కేసు ఛేదనలో భాగస్వాములు:

ఈ కేసు విజయవంతంగా ఛేదించడంలో కృషి చేసిన అధికారులు:

  • మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్
  • సీఐ లక్షెట్టిపేట రమణమూర్తి
  • ఎస్‌ఐ తాహేసీనుద్దీన్
  • ఎస్‌ఐ సురేష్
  • ఎస్‌ఐ అనూష
  • హెడ్ కానిస్టేబుళ్లు: గౌస్, గంగనాయక్, వసంత్, జహీర్, ఆనంద్
  • కానిస్టేబుళ్లు

డీసీపీ ఎగ్గడి భాస్కర్ అందరినీ అభినందించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793