-->

హనుమకొండ: నర్సింగ్ విద్యార్థినిపై కెమికల్ దాడి

హనుమకొండ: నర్సింగ్ విద్యార్థినిపై కెమికల్ దాడి


హనుమకొండలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. స్థానిక నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిపై కాజీపేట కడిపికొండ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడిందని సమాచారం.

గాయపడిన విద్యార్థిని్ని వెంటనే హనుమకొండ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

బాధితురాలు జనగాం జిల్లా, జఫరాఘడ్ మండలానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఘటనపై సమాచారమందుకున్న కాజీపేట ఏసీపీ సహా పోలీసులు ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని విచారిస్తున్నారు. దాడిచేసిన వ్యక్తులు ఎవరు? దాడి వెనుక కారణాలేమిటి? అనేవి తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793