కొత్తగూడెం సింగరేణి క్వార్టర్స్‌లో కోతులు–కుక్కలు పిల్లలు, నర్సులపై దాడులు బెడద
కొత్తగూడెం, డిసెంబర్ 20: కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని సింగరేణి క్వార్టర్స్‌లలో కోతులు మరియు కుక్కల బెడద రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇటీవల కాలంలో వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
డ్యూటీలకు వెళ్తున్న సింగరేణి కార్మికులపై, అలాగే కార్మికుల పిల్లలపై కోతులు, కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా మెయిన్ హాస్పిటల్ పరిధిలోని నర్సుల క్వార్టర్స్ ప్రాంతంలో డ్యూటీకి వెళ్తున్న నర్సులు, కార్మికులపై దాడి చేసిన సంఘటనలు అనేకం నమోదయ్యాయి.
ఇదే సమయంలో కోతులు ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్స్, సర్వీస్ వైర్లను తెంపి వేస్తుండటంతో విద్యుత్ సరఫరా తరచూ నిలిచిపోతోంది. దీనివల్ల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌పై పనిభారం పెరగడంతో పాటు, క్వార్టర్స్‌లలో నివసిస్తున్న కార్మికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అలాగే ఇళ్లలోకి దూరి విలువైన సామాగ్రిని ధ్వంసం చేయడం వల్ల ఆర్థిక నష్టాలు కూడా వాటిల్లుతున్నాయి.
ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని HMS యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మరింతగా కోతులు–కుక్కల బెడద పెరిగి, నిత్యం కార్మికులపై దాడులు జరుగుతున్నాయని, దీని వల్ల ఇటు సంస్థకు, అటు కార్మికులకు తీవ్ర నష్టం కలుగుతోందని తెలిపారు.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి, కోతులు మరియు వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని HMS యూనియన్ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేసింది. కార్మికులు, వారి కుటుంబాల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి, శాశ్వత పరిష్కారం చూపాలని యూనియన్ డిమాండ్ చేసింది

Post a Comment