-->

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ప్రారంభం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ప్రారంభం


హైదరాబాద్, జనవరి 09: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హడావుడి మొదలైంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నెల 16వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. తుది ఓటర్ల జాబితా విడుదల అనంతరం ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కసరత్తు కొనసాగిస్తోంది. అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తయితే ఫిబ్రవరి రెండో వారం లోపు ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశముందని ఎన్నికల వర్గాలు తెలిపాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793