తెలంగాణలో డీఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారుల బదిలీలు
హైదరాబాద్, జనవరి 25: తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ, ఏసీపీ స్థాయి పోలీసు అధికారుల బదిలీలకు సంబంధించి డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ నగరంలో సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేస్తున్న ఎల్. ఆదినారాయణను కొత్తగూడెం డీఎస్పీగా బదిలీ చేశారు. ప్రస్తుతం కొత్తగూడెంలో డీఎస్పీగా ఉన్న అబ్దుల్ రహ్మన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా, హైదరాబాద్ సీటీసీలో ఏసీపీగా పనిచేస్తున్న డీవీ. ప్రదీప్ కుమార్‌రెడ్డిని ఆదిబట్ల ఏసీపీగా బదిలీ చేశారు. సీఐడీ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఎం. ఆదిమూర్తిని మియాపూర్ ట్రాఫిక్ ఏసీపీగా నియమించారు. మల్కాజిగిరిలో ఏసీపీగా ఉన్న ఎస్. చక్రపాణిని జవహర్‌నగర్ ఏసీపీగా, నగర ఎస్‌బీ ఏసీపీగా పనిచేస్తున్న మోహన్ కుమార్‌ను మేడిపల్లి ఏసీపీగా బదిలీ చేశారు.
సిద్దిపేట టాస్క్‌ఫోర్స్‌లో ఏసీపీగా ఉన్న బి. రవీందర్‌ను భువనగిరి డీఎస్పీగా,
యాంటీ నార్కోటిక్ బ్యూరోలో డీఎస్పీగా ఉన్న సీహెచ్. శ్రీదర్‌ను మహాంకాళి ఏసీపీగా నియమించారు. టీజీపీఏలో డీఎస్పీగా పనిచేస్తున్న సారంగపాణిని ఎల్దెండు డీఎస్పీగా బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న ఎన్. చంద్రబానును హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Post a Comment