వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చున్నీతో హత్య చేసిన భార్య
హైదరాబాద్, జనవరి 20, 2026 : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో మరో దారుణ హత్య ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్యే భర్తను చున్నీతో ఉరేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం… సుధీర్ రెడ్డి (భర్త) గత నెల 24న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, భార్య ప్రసన్నను అదుపులోకి తీసుకొని విచారించగా ఆమెనే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్టు తెలిపారు.
హత్యకు వారం రోజుల ముందే తన భార్య తనను చంపే ప్రయత్నం చేస్తోందని సుధీర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ ఆ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకునేలోపే ఈ దారుణం జరిగింది.
నిందితురాలు ప్రసన్నను కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ నిమిత్తం కంది జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Post a Comment