-->

ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ

ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ


జనవరి 20, 2026: తెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి నుంచే ఫిర్యాదు చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఫిర్యాదు చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారి ఇంటికే పోలీసులు వెళ్లి ఫిర్యాదులను స్వీకరించనున్నారు.

ఈ కొత్త విధానం వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు సహా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఎంతో ఊరటగా మారనుంది. ప్రజలకు మరింత సులభంగా, వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈ సంస్కరణను అమలు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, సైబర్ నేరాల బాధితుల కోసం తెలంగాణ పోలీస్ శాఖ ప్రారంభించిన ‘సీ-మిత్ర’ సేవ మంచి ఫలితాలను ఇస్తోంది. సైబర్ మోసాలకు గురైన వారికి తక్షణ సహాయం, మార్గదర్శకత్వం అందిస్తూ ఈ సేవ ప్రజల్లో విశేష స్పందన పొందుతోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793