-->

భద్రాద్రి జిల్లా కోర్టు ఆవరణలో CPS యూనియన్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

భద్రాద్రి జిల్లా కోర్టు ఆవరణలో CPS యూనియన్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ


భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి జిల్లా కోర్టు ఆవరణలో CPS యూనియన్–2026 క్యాలెండర్‌ను జిల్లా జడ్జి పాటిల్ వసంత్ అధికారికంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు A.O. జే. కిరణ్ కుమార్, జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు రామిశెట్టి రమేష్, అలాగే దికొండ రవికుమార్, లగడపాటి సురేష్, శ్రీరంగం రామకృష్ణ, మీనా కుమారి, ఉష, సుశీల, కరుణాకర్ కిషోర్ తదితర జ్యుడీషియల్ సిబ్బంది పాల్గొన్నారు.

అలాగే TSCPSEU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తుక్కాని శ్రీనివాస రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా కార్యదర్శి మజ్హర్ అహ్మద్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రతినిధి బండి వెంకటేశ్వర్లు, బాలస్వామి, దేవరాం, నరసింహ రావు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TSCPSEU–2026 టేబుల్ క్యాలెండర్‌ను బాధ్యుల సమక్షంలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో CPS యూనియన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, CPS రద్దు చేసి, ఉద్యోగులందరిని OPS ఉద్యోగులుగా మార్చే వరకు నిరంతర పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793