ఏటూరునాగారం ట్రాక్టర్ బోల్తా: 14 మందికి గాయాలు
ఏటూరునాగారం, ఫిబ్రవరి 3: మిర్చి తోటలో కాయలు కోసేందుకు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక – శంకరాజుపల్లి గ్రామాల మధ్య చోటు చేసుకుంది.
మార్గమధ్యలో ఎదురుగా ఆటో రావడంతో, ట్రాక్టర్ డ్రైవర్ పాలెం నారాయణ వాహనాన్ని పక్కకు దించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో సురేంద్ర, సమ్మయ్య, లక్ష్మి, బాబు, విజయ్, భద్రమ్మ, నందిని, దేవి, భీమమ్మ, మదన్, సునీత, అమ్జద్ పాషా, కాసీం, శివరాణి తదితరులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలించారు. ఈ ఘటనపై ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.

Post a Comment