హుస్సేన్ సాగర్‌లో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్‌లో నీటిపై తేలుతున్న గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని లేక్ పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు.
యువతి వయస్సు, గుర్తింపు వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు లేక్ పోలీసులు వెల్లడించారు.
యువతి ఎవరికైనా గుర్తుపడితే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Post a Comment