-->

మున్సిపల్ ఎన్నికలు: 14 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవ ఫలితాలు

మున్సిపల్ ఎన్నికలు: 14 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవ ఫలితాలు


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏకగ్రీవ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికంగా ఖాతా తెరిచింది.

మొత్తం 14 ఏకగ్రీవ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 12 చోట్ల విజయం సాధించగా, బీఆర్ఎస్ పార్టీ రెండు వార్డుల్లో ఏకగ్రీవంగా గెలుపొందింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సూర్యాపేట జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఏకగ్రీవ ఫలితాలు నమోదు కావడం విశేషం.

కొడాడ మున్సిపాలిటీలో మూడు వార్డులు ఏకగ్రీవంగా తేలగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు వార్డుల్లో ఏకగ్రీవ ఫలితాలు వెలువడ్డాయి. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెరో ఒక ఏకగ్రీవ విజయం దక్కింది.

అలాగే మహబూబ్‌నగర్, మెదక్, పెద్దపల్లి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793