-->

ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు బాలికలపై లైంగిక దాడి ఆరోపణలు

ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు బాలికలపై లైంగిక దాడి ఆరోపణలు


ఆసిఫాబాద్; ఫిబ్రవరి 4: ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల పరిధిలోని ఓ గ్రామంలో ముగ్గురు బాలికలపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు వెలుగుచూశాయి. ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.

స్థానిక సమాచారం ప్రకారం, ఆదివారం ఆ గ్రామంలో ఆరేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు, తొమ్మిదేళ్ల వయసున్న మరో బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా, పక్కనే నివాసం ఉంటున్న 13 ఏళ్ల బాలుడు వారి వద్దకు వెళ్లాడు. డబ్బులు ఇస్తానని ఆశ చూపి నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

విషయం తెలుసుకున్న కౌటాల సీఐ సంతోష్‌, ఎస్సై నరేశ్‌ మంగళవారం గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధిత బాలికలను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793