-->

పాఠశాలకు వెళ్తున్న బాలుడిపై వీధి కుక్క దాడి

పాఠశాలకు వెళ్తున్న బాలుడిపై వీధి కుక్క దాడి


ఊట్కూర్ | ఫిబ్రవరి 4: ఊట్కూర్ మండల కేంద్రంలో వీధి కుక్కల దాడులు రోజురోజుకీ పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులపై కుక్కలు దాడి చేయడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.

బుధవారం ఉదయం మండల కేంద్రానికి చెందిన అహ్మద్ హుస్సేన్ కుమారుడు హాసన్, స్థానిక మిలాత్ పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనలో గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పాఠశాలలకు వెళ్లే పిల్లల భద్రతపై తీవ్ర ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని పలుమార్లు అధికారులను కోరినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తక్షణమే కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టి, చిన్నారుల భద్రతను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793