-->

గోదావరిఖని సమ్మక్క జాతర ఆదాయం రూ.57.74 లక్షలు

గోదావరిఖని సమ్మక్క జాతర ఆదాయం రూ.57.74 లక్షలు


గోదావరిఖని సమ్మక్క–సారలమ్మ జాతరకు ఈ ఏడాది మొత్తం రూ.57.74 లక్షల ఆదాయం సమకూరినట్లు జాతర కమిటీ ప్రకటించింది. ఆదివారం సారలమ్మ దేవాలయం హాల్‌లో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.

మొత్తం 44 హుండీల ద్వారా రూ.31,26,324 ఆదాయం లభించింది. గతేడాది హుండీల ద్వారా రూ.29,44,489 రాగా, ఈ ఏడాది రూ.1,81,835 అదనపు ఆదాయం నమోదైంది.

వేలం పాటల ద్వారా గతేడాది రూ.13 లక్షల ఆదాయం రాగా, ఈసారి రూ.19.89 లక్షలు సమకూరినట్లు అధికారులు తెలిపారు. టికెట్ల విక్రయాల ద్వారా రూ.6,59,560 ఆదాయం లభించింది. అదనంగా రెండు గ్రాముల బంగారం, 790 గ్రాముల వెండి కూడా భక్తులు సమర్పించినట్లు వెల్లడించారు.

మొత్తంగా గత జాతరతో పోలిస్తే ఈ ఏడాది రూ.8,86,195 అదనపు ఆదాయం వచ్చినట్లు జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఈవో కాంతారెడ్డి తెలిపారు.

హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లా ఎండోమెంట్ ఏఈ సుప్రియ, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మి, శ్రీవెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ కోఆర్డినేటర్ మమత రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 80 మంది సేవా సమితి మహిళలు పాల్గొన్నారు. మోహన్‌రెడ్డి, బంగారు రాజయ్య తదితరులు హాజరయ్యారు. భద్రతా ఏర్పాట్లను సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ మనోహర్ పర్యవేక్షించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793