చనిపోయినా వీడని పెంపుడు కుక్క బంధం.. ఈ దృశ్యమే సాక్ష్యం వీడియో !
నల్గొండ జిల్లా కిష్టాపురంలో హృదయాన్ని కదిలించే ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పార్వతమ్మ అనే వృద్ధురాలు ఓ పెంపుడు కుక్కను ఎంతో మమకారంతో చూసుకుంటుండేది. ఆమె ఇటీవల మరణించగా అంత్యక్రియలు పూర్తయ్యాయి.
అయితే… యజమాని లేకపోయినా ఆ మూగజీవి మాత్రం ఆమెను వదిలి వెళ్లలేకపోతోంది. శ్మశానవాటికలోని ఆమె సమాధి వద్దే మండుటెండను లెక్కచేయకుండా కూర్చొని ఉండిపోతోంది. ఆ కుక్క కళ్లలో కనిపిస్తున్న ఆవేదన చూసి గ్రామస్థులు భావోద్వేగానికి గురవుతున్నారు.
“మనుషులకన్నా జంతువుల ప్రేమ నిజమైనది” అంటూ గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. యజమానిపై ఆ కుక్క చూపుతున్న విశ్వాసం, ప్రేమ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఈ హృదయ విదారక దృశ్యాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Post a Comment