-->

ఫ్లైఓవర్‌పై బొలెరో–బైక్ ఢీ… ఒకరు మృతి, మరోకరికి తీవ్ర గాయాలు

ఫ్లైఓవర్‌పై బొలెరో–బైక్ ఢీ… ఒకరు మృతి, మరోకరికి తీవ్ర గాయాలు
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

జనగామ, ఫిబ్రవరి 6: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జనగామ పట్టణంలోని ఫ్లైఓవర్‌పై బొలెరో వాహనం, బైక్‌ను ఎదురెదురుగా ఢీకొట్టాయి.

ఈ ప్రమాదంలో స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే జనగామ మండలం శామీర్‌పేటకు చెందిన అభిలాష్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని వెంటనే జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అభిలాష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793