-->

వ్యభిచారం గుట్టు రట్టు లాడ్జిపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ దాడులు

వ్యభిచారం గుట్టు రట్టు లాడ్జిపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ దాడులు


చైతన్యపురి, ఫిబ్రవరి : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా ఓయో బోర్డులు ఏర్పాటు చేసి వ్యభిచార దందా నిర్వహిస్తున్న ప్రైవేట్ లాడ్జిపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) పోలీసులు దాడులు నిర్వహించారు.

ఎల్బీనగర్ ఇన్‌స్పెక్టర్ కే. వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, కామినేని చౌరస్తా నుంచి సిరీస్ రోడ్‌లోని శివగంగా కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న వశిష్ఠ రెసిడెన్సీ లగ్జరీ రూమ్స్ లో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా ఓయో బోర్డులు ఏర్పాటు చేసి, హోటల్ యాజమాన్యం వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.

ఈ సమాచారం మేరకు ఎల్బీనగర్ పోలీసులు, మల్కాజిగిరి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ బృందంతో కలిసి లాడ్జిపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచారం చేస్తున్న మహిళతో పాటు విటుడు అభిలాష్, రిసెప్షనిస్ట్ నారాయణను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచినట్లు పోలీసులు తెలిపారు.

వారి వద్ద నుంచి కండోమ్ ప్యాకెట్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, బాధిత మహిళను ప్రజ్వల హోమ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కాగా, లాడ్జి యజమాని హేమంత్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, “అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793