-->

కరీంనగర్లో విషాదం: కాలువలో నవవధువు మృతదేహం లభ్యం

కరీంనగర్లో విషాదం: కాలువలో నవవధువు మృతదేహం లభ్యం


కరీంనగర్; ఫిబ్రవరి 19: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లలితాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గత జూలైలో వివాహమైన పోలవేణి అనుష బుధవారం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

కాలువ సమీపంలో ఆమె చెప్పులు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రంగపేట శివారులోని కాకతీయ కాలువలో అనుష మృతదేహం లభ్యమైంది.

పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793