-->

బడ్జెట్ దెబ్బతో మద్యం ధరలు ఆకాశానికి

బడ్జెట్ దెబ్బతో మద్యం ధరలు ఆకాశానికి


న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్–2026లో ‘సిన్ గూడ్స్’పై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. మద్యం, సిగరెట్ల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. ఆల్కహాల్ స్క్రాప్, మినరల్ సేల్స్‌పై TCSను 1 శాతం నుంచి 2 శాతానికి పెంచడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకాలను సవరించే అవకాశం ఉండటంతో మద్యం ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పటివరకు రూ.1,000గా ఉన్న మద్యం బాటిల్ ధర రూ.1,050 నుంచి రూ.1,100 వరకు చేరే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రభావం అన్ని బ్రాండ్లపై పడే అవకాశముంది.

సిగరెట్లపై ఇప్పటికే ఉన్న 40 శాతం GSTతో పాటు అదనపు సెస్, ఎక్సైజ్ డ్యూటీలు విధించడంతో ధరలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. అయితే బీడీల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది.

బడ్జెట్ నిర్ణయాలతో మద్యం, పొగాకు వినియోగదారులపై ఆర్థిక భారం పెరగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793