-->

16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా నిషేధం.. కర్ణాటక ప్రభుత్వ కీలక నిర్ణయం

16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా నిషేధం.. కర్ణాటక ప్రభుత్వ కీలక నిర్ణయం


బెంగళూరు: పిల్లలపై మొబైల్‌, సోషల్‌ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు Karnataka ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి Siddaramaiah ప్రకటించారు.

పిల్లల్లో మొబైల్‌, సోషల్‌ మీడియా అధిక వినియోగం వల్ల మానసిక, శారీరక సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.

ఈ రోజు రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు కూడా మొబైల్ వినియోగంపై పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం సూచించింది.

ఈ నిర్ణయం అమలుకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలను త్వరలో ప్రకటించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793