కరీంనగర్‌లో ACB దాడులు – ఇద్దరు అధికారుల అదుపులోకి
కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండెటి రాము, అలాగే ఓబులాపూర్‌కు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) జక్కని వేణును Telangana Anti-Corruption Bureau (ACB) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల ప్రకారం, గుండెటి రాము వేములవాడ ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన సమయంలో తన స్నేహితుడు, మాజీ సహోద్యోగి అయిన జక్కని వేణు సహకారంతో ఒక బెల్లం వ్యాపారి నుండి 2022 నుంచి 2024 మధ్య కాలంలో యూపీఐ (UPI) లావాదేవీల రూపంలో నిరంతరం లంచాలు (మామూళ్లు) వసూలు చేసినట్లు ACB గుర్తించింది.
ఈ నేపథ్యంలో రాము నివాసంలో నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో చూపని సుమారు రూ.20 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
📱 ఇతర మార్గాలు:
- వాట్సాప్: 9440446106
- ఫేస్‌బుక్: Telangana ACB
- ఎక్స్ (ట్విట్టర్): @TelanganaACB
- వెబ్‌సైట్: acb.telangana.gov.in
ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని ACB స్పష్టం చేసింది.

Post a Comment