హైదరాబాద్‌లో మరో ఉస్మానియా బిస్కెట్ ఫ్యాక్టరీ సీజ్
హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ఉస్మానియా బిస్కెట్‌ల తయారీపై అధికారులు కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. ఇటీవల నాసిరకం బిస్కెట్ల తయారీ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, తాజాగా మరో అక్రమ ఫ్యాక్టరీపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
హైదరాబాద్‌లోని కేడీ కాలనీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న బిస్కెట్ తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో, నాసిరకం ముడి సరుకులతో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
దాడుల సందర్భంగా భారీగా నిల్వ ఉంచిన బేకరీ ఉత్పత్తులు, ముడి పదార్థాలు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫ్యాక్టరీలో తయారైన బిస్కెట్లు నగరంలోని కిరాణా షాపులు, హోటళ్లు, బేకరీలు, కేఫ్‌లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న అహ్మద్ రజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని అధికారులు హెచ్చరించారు.
ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు నాణ్యమైన మరియు నమ్మకమైన చోట్ల నుంచే ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

Post a Comment